

26వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) అవార్డ్స్ 2026 విజేతలను అక్టోబర్ 30న ప్రకటించారు. ఈసారి అవార్డుల వేడుకలో రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ సినిమా అత్యధికంగా 12 పురస్కారాలను గెలుచుకుని ఆధిపత్యం ప్రదర్శించింది. ఉత్తమ చిత్రంగా నిలిచిన ఈ సినిమాకు గాను రణ్‌వీర్ సింగ్ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. దర్శకుడు ఆదిత్య ధర్ ఉత్తమ దర్శకుడిగా నిలవడంతో పాటు ఉత్తమ ఒరిజినల్ స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ విభాగాల్లోనూ పురస్కారాలు సాధించారు. అక్షయ్ ఖన్నా ఉత్తమ ప్రతినాయకుడిగా, సంజయ్ దత్ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డులు అందుకున్నారు.
మరోవైపు సైయారా సినిమా కూడా పలు అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రంతో గుర్తింపు పొందిన అనీత్ పడ్డా ఉత్తమ నటిగా, అహాన్ పాండే ఉత్తమ నూతన నటుడిగా నిలిచారు. సైయారా పాటలకు సంబంధించి ఉత్తమ గీత రచన, ఉత్తమ పురుష గాయకుడి పురస్కారాలు కూడా లభించాయి. ఛావా సినిమా సాంకేతిక విభాగాల్లో మూడు అవార్డులను గెలుచుకోగా, జాలీ ఎల్‌ఎల్‌బీ 3 చిత్రానికి హ్యూమా ఖురేషీ ఉత్తమ సహాయ నటిగా ఎంపికయ్యారు. అజాద్ చిత్రంతో పరిచయమైన రాషా థడానీ ఉత్తమ నూతన నటిగా నిలిచారు. డిజిటల్ విభాగాల్లో బరాముల్లా ఉత్తమ చిత్రంగా, స్టోలెన్ ఉత్తమ దర్శకత్వం విభాగంలో విజయం సాధించాయి. ది బా\*\*డ్స్ ఆఫ్ బాలీవుడ్ ఉత్తమ సిరీస్‌గా నిలవగా, ఆర్యన్ ఖాన్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. తదుపరి ఐఫా వేడుకలు 2027 జనవరి 22, 23 తేదీల్లో అబుదాబిలోని యాస్ ఐలాండ్ ఎతిహాద్ అరేనాలో జరగనున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!