
టెక్నాలజీ

నాసిక్‌లోని శ్రీ సప్తశృంగీ నివాసినీ దేవి ట్రస్ట్ సభ్యుల నియామక ప్రక్రియకు సంబంధించి బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో ఈ నియామకాలను నిలిపివేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ధర్మాసనం కొట్టివేసింది. దీంతో ట్రస్ట్ సభ్యుల నియామక ప్రక్రియపై విధించిన స్టే తొలగిపోయింది.
చీఫ్ జస్టిస్ అనుమతి లేకుండానే ఆయన పేరుతో స్పెషల్ ఆఫీసర్ ఉత్తర్వులు జారీ చేయడంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్యను తీవ్రమైన అధికార దుర్వినియోగంగా అభివర్ణిస్తూ, ఇది కోర్టు మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో గతంలో నియామకాలపై విధించిన స్టేను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!