

నరేష్ అగస్త్య, ఫారియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన డార్క్ కామెడీ చిత్రం “గుర్రం పాపిరెడ్డి” ఈ నెల 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. డా. సంధ్య గోలి సమర్పణలో వేణు సద్ది, అమర్ బూరా, జయకాంత్ (బాబీ) నిర్మాతలుగా తెరకెక్కిన ఈ చిత్రానికి మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. చిత్రంలో తాను సౌధామిని అనే నర్స్ పాత్రలో కనిపిస్తానని హీరోయిన్ ఫారియా అబ్దుల్లా తెలిపారు. తెలివైన వారు, తెలివిలేని వారి మధ్య జరిగే సంఘర్షణే ఈ కథాంశమని, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని ఆమె చెప్పారు. బ్రహ్మానందం న్యాయమూర్తి పాత్రలో కనిపించగా, కోర్ట్ సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయని వెల్లడించారు.
ఈ చిత్రంలో విభిన్న గెటప్‌లలో కనిపించానని, అలాంటి పాత్రలు నటులకు అరుదుగా లభిస్తాయని ఫారియా చెప్పారు. ‘జాతిరత్నాలు’లోని చిట్టి పాత్రకు, ఈ సినిమాలోని సౌధామిని పాత్రకు ఎలాంటి పోలిక లేదని స్పష్టం చేశారు. నిర్మాతలు కొత్తవారైనా ఎంతో ప్యాషన్‌తో సినిమాను తీశారని, ప్రమోషన్లలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ప్రశంసించారు. దర్శకుడు మురళీ మనోహర్ విజన్‌ను తెరపై అద్భుతంగా చూపించారని అన్నారు. ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాను ఆస్వాదిస్తారని నమ్మకం వ్యక్తం చేస్తూ, త్వరలో మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్‌లో కనిపిస్తానని తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!