
రాజకీయాలు

బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్‌కు యూట్యూబ్ కొత్త విజయానికి వేదికగా మారింది. 2024లో వంటలకు సంబంధించిన వ్లాగ్‌లతో యూట్యూబ్‌లోకి అడుగుపెట్టిన ఆమె.. సెలబ్రిటీలతో వంటలు, కుటుంబ సరదా క్షణాలు, లైఫ్‌స్టైల్ కంటెంట్‌తో ప్రత్యేకమైన ప్రేక్షకులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఆమె కుక్ దిలీప్‌తో చేసే సరదా సంభాషణలు, ఇద్దరి మధ్య సహజమైన కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
యూట్యూబ్ ద్వారా వస్తున్న ఆదాయం తనకు ఆశ్చర్యం కలిగించే స్థాయిలో ఉందని ఫరా ఖాన్ వెల్లడించారు. సోహా అలీ ఖాన్‌తో జరిగిన సంభాషణలో.. తన మొత్తం సినీ కెరీర్‌లో ఏ ఒక్క సంవత్సరంలోనూ సంపాదించనంత డబ్బు యూట్యూబ్ ద్వారా సంపాదించి ఉండొచ్చని ఆమె పేర్కొన్నారు. సినిమాలు, టెలివిజన్‌తో పోలిస్తే యూట్యూబ్‌లో పూర్తి సృజనాత్మక స్వేచ్ఛ లభించడం తనకు ఎంతో నచ్చుతుందని చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!