

పెద్ది సినిమా విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో ఇద్దరిపై కేసు నమోదైనట్లు సమాచారం. రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై గుంటూరు, హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా నెగెటివిటీ సృష్టిస్తున్నట్లు చిత్రబృందం గుర్తించింది. ఆధారాలను సేకరించిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సినిమా ప్రతిష్ఠను కాపాడేందుకు చిత్రబృందం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన సన్నివేశాలు, పాటలు లీక్ కాకుండా చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. కాపీరైట్ పరిరక్షణకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి, సినిమా కంటెంట్‌ను అక్రమంగా అప్లోడ్ చేయడం, ప్రసారం చేయడం, కాపీ చేయడాన్ని నిషేధించింది. ఈ చర్యలతో ముందస్తు లీక్‌లను అడ్డుకునే ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!