

సూర్య కోలీవుడ్‌లో మంచి కథలతో సినిమాలు చేసే స్టార్ హీరో. కానీ ఇటీవల ఆయన సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. ఇప్పుడు ఆయన నటించిన కొత్త సినిమా ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) పై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించగా, త్రిష హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో సూర్య లాయర్‌గా కనిపించనున్నారు. ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
కానీ విడుదలకు ముందు ఈ సినిమాకు ఒక పెద్ద షాక్ తగిలింది. తమిళనాడు ప్రభుత్వం ఉదయం 9 గంటలకు స్పెషల్ షోలు పెట్టడానికి అనుమతి ఇచ్చినా, కొన్ని కారణాల వల్ల కరుప్పు స్పెషల్ షోలు రద్దు చేశారు. ఈ విషయాన్ని నిర్మాత ఎస్.ఆర్. ప్రభు తెలిపారు. అసలు కారణం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం సాధారణ షోలు మాత్రమే ప్రదర్శిస్తున్నారు. దీంతో సూర్య అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!