

విశ్వంభర సినిమాపై సోషల్ మీడియాలో వస్తోన్న రెండు పార్టుల రూమర్లకు దర్శకుడు మల్లిడివశిష్ఠ క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీ సినిమాపై ప్రారంభంలోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాన్సెప్ట్, కాస్టింగ్, ప్రచార చిత్రాలు అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ, టీజర్ విడుదల తర్వాత సినిమాపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఆ తరువాత విడుదల తేదీపై స్పష్టత లేకపోవడంతో రకరకాల ప్రచారాలు ప్రారంభమయ్యాయి.
ఈ నేపథ్యంలో ‘విశ్వంభర’ను రెండు భాగాలుగా విడుదల చేస్తారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టుపై వశిష్ఠ స్పందించారు. “అవునా.. నిజమా” అంటూ నవ్వుతున్న ఎమోజీలు జోడిస్తూ ఆ వార్తలను పరోక్షంగా ఖండించారు. దీంతో సినిమా ఒకే భాగంగా విడుదల కానుందని స్పష్టత వచ్చినట్లైంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిషకృష్ణన్, ఆశికారంగనాథ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను జూన్ లేదా జులైలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!