

కోలీవుడ్‌లో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న ధనుష్ ఇప్పటికే పలువురు టాలీవుడ్ దర్శకులు, నిర్మాతలతో కలిసి సినిమాలు చేశారు. ఆయన హీరోగా తెలుగులో నేరుగా తెరకెక్కిన ‘సార్’ చిత్రంతో నిర్మాత నాగవంశీకి మంచి గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో ధనుష్-నాగవంశీ విజయవంతమైన కాంబినేషన్ మరోసారి తెరపైకి రాబోతుందనే ప్రచారం కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. నాగవంశీ నిర్మాణంలో ధనుష్ హీరోగా ఓ కొత్త సినిమా తెరకెక్కే అవకాశం ఉందని సమాచారం.
ఈ ప్రాజెక్ట్ కోసం ‘లబ్బర్ పండు’తో విజయాన్ని అందుకున్న దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ధనుష్, నాగవంశీ, తమిళరసన్ పచ్చముత్తు కలయికలో రూపొందనున్న ఈ సినిమా కథపై ఆసక్తి నెలకొంది. స్పోర్ట్స్ డ్రామాతో గుర్తింపు తెచ్చుకున్న పచ్చముత్తు.. ధనుష్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేశారనే చర్చ సాగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!