

యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా బోనాల వేడుకల సమయంలో తన సోషల్ మీడియా పోస్ట్ చుట్టూ ఏర్పడిన వివాదంపై మరోసారి స్పందించింది. తన తాజా చిత్రం ‘సిగ్మా’ విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆమె.. తన పోస్ట్‌కు వచ్చిన స్పందన చూసి ఆశ్చర్యపోయానని తెలిపింది. 2026లో కూడా సమాజంలో కొన్ని సంప్రదాయ భావజాలాలు కొనసాగుతుండటం తనకు ఆశ్చర్యంగా అనిపించిందని పేర్కొంది. తాను ఎప్పుడూ ముందుచూపుతో ఆలోచించే వ్యక్తినని ఫరియా చెప్పింది.
సోషల్ మీడియా తన అభిప్రాయాలను పంచుకునే వేదిక మాత్రమేనని, ప్రతి ఒక్కరికీ భిన్నమైన ఆలోచనలు ఉంటాయని తాను అర్థం చేసుకుంటానని ఫరియా తెలిపింది. ఇతరుల అభిప్రాయాలతో ఏకీభవించకపోయినా, వారి ఆలోచనా విధానాన్ని గౌరవిస్తానని స్పష్టం చేసింది. ఈ వివాదాన్ని ఇక మరింత కొనసాగించడం తనకు ఇష్టం లేదని, తన ఆలోచనల్లో శాంతి, ప్రేమ మాత్రమే ఉంటాయని చెప్పింది. ప్రస్తుతం తన పూర్తి దృష్టి ‘సిగ్మా’ సినిమా ప్రమోషన్స్‌పైనే ఉండాలని కోరుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!