

యంగ్ హీరో హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేగలై జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ‘దీవాన’ ముందుగా ప్రకటించిన ప్రకారం జూన్ 19న విడుదల కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో వాయిదా పడింది. సెన్సార్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల తేదీ ఒక రోజు వెనక్కి వెళ్లింది.
అయితే గత రెండు రోజులుగా నిర్వహించిన ప్రీమియర్ షోలకు మంచి స్పందన లభిస్తోంది. దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తోంది. వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ చిత్రానికి ఈశ్వర్ చంద్ సంగీతం అందించారు. మేకర్స్ ప్రకటించిన ప్రకారం ‘దీవాన’ జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుండగా, జూన్ 19న ప్రత్యేక పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!