

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మొదటి వారంలోనే రూ.292 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు నిర్మాతలు వెల్లడించారు. ఒకే వారం లో ఈ స్థాయి వసూళ్లు సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా ఇది నిలిచింది.
ప్రీమియర్స్ నుంచే టికెట్లకు భారీ డిమాండ్ ఉండటంతో వసూళ్లు నిరంతరం పెరుగుతున్నాయి. విడుదలైన ఏడో రోజు (ఈ నెల 18) మాత్రమే రూ.31 కోట్లు వసూలు చేసి, తెలుగు రాష్ట్రాల్లో ఏడో రోజున అత్యధిక వసూళ్లు సాధించిన తొలి తెలుగు చిత్రంగా రికార్డు నెలకొల్పింది. విదేశాల్లోనూ మంచి స్పందన లభించగా, నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 2.96 మిలియన్ డాలర్లు వసూలు చేసి 3 మిలియన్ డాలర్ల క్లబ్‌కు అతి చేరువలో ఉంది. ఈ సినిమాతో అనిల్ రావిపూడి వరుసగా రెండు సంవత్సరాల్లో రెండు రూ.200 కోట్ల సినిమాలు అందించిన దర్శకుడిగా మరో ఘనత సాధించారు.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!