

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘గేమ్ చేంజర్’ తర్వాత ఆయనకు బలమైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్, ఈ సినిమాను ఇండస్ట్రీ హిట్ స్థాయికి తీసుకెళ్లే కంటెంట్‌గా భావిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అంతా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమా పై హైప్ మరింత పెరిగింది. ఈ నెల 18న విడుదల కానున్న థియేట్రికల్ ట్రైలర్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి ట్రైలర్ చూసిన తర్వాత చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన “జస్ట్ వావ్ అనిపించింది” అంటూ రామ్ చరణ్, బుచ్చిబాబు, రెహమాన్ పనితీరును ప్రశంసించారు. ఎమోషన్స్, ఎలివేషన్స్ అన్నీ వేరే లెవెల్‌లో ఉన్నాయని చెప్పిన ఆయన ఒక డైలాగ్‌ను కూడా లీక్ చేయడం అభిమానుల్లో మరింత హైప్ క్రియేట్ చేసింది.
ట్రైలర్ నిడివి సుమారు 3 నిమిషాలకు పైగా ఉండనుందని సమాచారం. చిరంజీవి స్పందనతో ఈ సినిమా రామ్ చరణ్‌కు మరో ‘రంగస్థలం’ తరహా హిట్ ఇవ్వబోతుందనే అంచనాలు పెరిగాయి. ముంబైలో జరగనున్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం మేకర్స్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!