
క్రీడలు

మెగాస్టార్ చిరంజీవి ‘పెద్ది’ ట్రైలర్ చూసిన తర్వాత ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన సినిమాలోని ఒక పవర్‌ఫుల్ డైలాగ్‌ను కూడా రివీల్ చేయడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. దీంతో మళ్లీ #ChiruLeaks ట్రెండ్‌లోకి వచ్చింది.
దాదాపు 3 నిమిషాల పాటు ఉన్న ఈ ట్రైలర్‌ను “ప్యూర్ ఫైర్‌పవర్ ప్యాక్డ్” అనుభవంగా చిరంజీవి అభివర్ణించారు. రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, బుచ్చిబాబు సనా విజన్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ముగ్గురూ వేరే లెవెల్‌లో ఉన్నారని ప్రశంసించారు. ట్రైలర్‌లో ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్‌నెస్ అన్నీ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయని చెప్పారు.
డైరెక్టర్ బుచ్చిబాబు సనాకు సరదాగా సారీ చెప్పిన చిరంజీవి, ట్రైలర్ చూసిన తర్వాత కంట్రోల్ తప్పిపోయానని వ్యాఖ్యానించారు. ఆయన రియాక్షన్‌తో ‘పెద్ది’పై అంచనాలు మరింత పెరిగి, మెగా అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!