
క్రీడలు

టాలీవుడ్‌లో రానున్న క్రేజీ మల్టీస్టారర్ సినిమాల్లో వెంకటేష్ (వెంకీ మామ) మరియు నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో దర్శకుడు అనీల్ రావిపూడి రూపొందిస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ ఒకటి. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ బజ్ క్రియేట్ చేసింది.
తాజా సమాచారం ప్రకారం దర్శకుడు అనీల్ రావిపూడి తన టీమ్‌తో కలిసి ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. విశాఖపట్నంలో మకాం వేసి కథను ఫైనల్ చేసే పనులు జరుగుతున్నాయి. స్క్రిప్ట్ పూర్తయ్యాక సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈలోగా వెంకటేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం’ను పూర్తి చేయనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను సురేష్ ప్రొడక్షన్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!