
జనరల్

నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా స్పందించారు. దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆయన ఆరోపించారు.
ఇంత పెద్ద ఘటన జరిగినా ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉండటం దారుణమని రాహుల్ గాంధీ విమర్శించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని లేదా ఈ వైఫల్యానికి ప్రధానే బాధ్యత తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
విద్యార్థుల నమ్మకాన్ని దెబ్బతీసిన ఈ ఘటనపై తక్షణమే బాధ్యత నిర్ణయించాలని, వ్యవస్థపై ప్రజల విశ్వాసం పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!