

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి టెట్ (TET) నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. 2011కు ముందు నుంచే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారికీ టెట్ పరీక్ష తప్పనిసరి చేయడం వల్ల దాదాపు లక్ష మంది టీచర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇప్పటికే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులకు ఇప్పుడు టెట్‌ను తప్పనిసరి చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.
టెట్ నిబంధనల వల్ల ప్రమోషన్లు, ఉద్యోగ భద్రతపై ప్రభావం పడటంతో పాటు ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని జగన్ అన్నారు. 2011కు ముందు సేవలో చేరిన టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కూడా సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!