

రామ్చరణ్ భార్య ఉపాసన ఇటీవల కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే! ఈ నెల 11న బారసాల కార్యక్రమం నిర్వహించి చిన్నారులు ఇద్దరికీ నామకరణం చేశారు. బాబుకి శివరామ్ అని, పాపకు అన్వీరా దేవి అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని చిరంజీవితోపాటు రామ్చరణ్, ఉపాసన కూడా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తాజాగా చిరంజీవి మరో పోస్ట్ పెట్టారు.
‘మా ఇద్దరు చిన్నారులకు పెట్టిన అందమైన పేర్లను ఎంతో అభినందిస్తున్నారు. నాకు దేశ విదేశాల నుంచి స్నేహితులు, బంధువులు, అభిమానలు, ఫోన్లు చేస్తున్నారు, సందేశాలు పంపుతున్నారు. హృదయం నిండిపోయింది. మన సంస్కృతి, వారసత్వం, పవిత్ర ఆలయాల ఆశీర్వాదాలతో ఆధ్యాత్మికత నిండిన పేర్లను ఎంపిక చేసినందుకు మా ప్రియమైన రామ్చరణ్, ఉపాసనకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. అలాగే, చిన్నారి అన్వీరాకు తన నాన్నమ్మ అంజనా దేవి గారి పేరులోని ‘దేవి’ని చేర్చి చరణ్ చూపిన ప్రేమ, తీసుకున్న నిర్ణయం నా మనసుకు హత్తుకుంది. భగవంతుడు ఎల్లప్పుడు మీకు పిల్లలకు రక్షగా ఉండాలని, సన్మార్గంలో నడిపించాలని కోరుకుంటున్నాను’ అని చిరంజీవి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!