

‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంలోని ‘గుర్తుందా’ పాట ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించగా, తాజాగా రెండో సింగిల్ ‘వదలనే’ను విడుదల చేశారు. ఈ పాట జావేద్ అలీ గాత్రంతో ప్రారంభమై శ్రోతలను ఆకట్టుకుంటుంది. మణి శర్మ మరోసారి తన మెలోడీ మాంత్రికత్వాన్ని నిరూపిస్తూ, ఈ సాంగ్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఐదు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ పాట వినిపించే ప్రతి క్షణం పాత జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఉంటుంది. గీత రచయిత అనంత శ్రీరామ్ ప్రేమ వాగ్దానాలను అద్భుతంగా పదబంధాల్లో వ్యక్తపరిచారు.
వర్షంలో తడిసిన భావోద్వేగ సన్నివేశాలతో ఈ పాట విజువల్‌గా కూడా ఆకట్టుకుంటోంది. హీరో కిరణ్ అబ్బవరం మరియు హీరోయిన్ వైష్ణవి చైతన్య మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రత్యేకంగా నిలుస్తోంది. సాయి రాజేష్, ఎస్‌కేఎన్ కలయికలో వచ్చిన ఈ పాట ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తుండగా, పూర్తి ఆల్బమ్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!