

టాలీవుడ్ జక్కన్నగా పేరుగాంచిన ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు తో భారీ స్థాయి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వారణాసి నేపథ్యంగా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు సృష్టిస్తోంది.
ఈ సినిమా పూర్తయ్యాక రాజమౌళి తదుపరి సినిమా ఎవరితో ఉంటుందన్న ఆసక్తి ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో ‘పుష్ప’, ‘పుష్ప–2’ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ పేరు బలంగా వినిపిస్తోంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా అనంతరం రాజమౌళి–అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది.
ఈ ప్రాజెక్ట్ కోసం రాజమౌళి తండ్రి, ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే ఓ ప్రత్యేక కథను సిద్ధం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ కథ ట్రైబల్ నేపథ్యంతో, కొత్త తరహా కథనంతో ఉండొచ్చని సమాచారం.
అయితే ఇవన్నీ ప్రస్తుతం ప్రచార స్థాయిలోనే ఉన్నాయి. అధికారిక ప్రకటన రావాలంటే ఇంకా కొంత కాలం వేచి చూడాల్సిందే.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!