
జనరల్

భారతదేశంలోని ప్రముఖ దర్శకుడు శంకర్ కుమారుడు ఆర్జిత్ శంకర్ హీరోగా సినీ రంగ ప్రవేశానికి సిద్ధమయ్యాడు. తొలుత అమెరికాలో ఫిల్మ్ మేకింగ్‌లో శిక్షణ తీసుకున్న ఆయన, తర్వాత నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో నటనలో ట్రైనింగ్ పొందారు. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఆయన సోదరి అదితి శంకర్ ఇప్పటికే హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
ఈ సినిమా ప్రారంభోత్సవానికి నటుడు విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ హాజరై ఆర్జిత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రం చెన్నైలో ప్రారంభమైంది. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అట్లీ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన అశోక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్యాషన్ స్టూడియోస్ నిర్మిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!