
జనరల్

‘సలార్’లో ప్రభాస్ స్నేహితుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రస్తుతం మహేశ్ బాబు–రాజమౌళి ‘వారణాసి’లో విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పుడు హీరోగా అతను నటించిన కొత్త చిత్రం ‘ఐ, నోబడీ’ జూలై 9న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమైంది.
తాజాగా విడుదలైన ట్రైలర్ డబ్బు చుట్టూ తిరిగే యాక్షన్ థ్రిల్లర్‌గా ఆసక్తిని పెంచింది. ప్రభుత్వ ఉద్యోగి రాజీవ్‌గా పృథ్వీరాజ్ కనిపించగా, ఓ ఆర్థిక వివాదంలో చిక్కుకుని పోలీసుల ఒత్తిడికి గురవుతాడు. ఈ కథలో అతని అసలు గుర్తింపు ఏమిటి అనే ప్రశ్నతో సినిమా ఆసక్తి రేపుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!