
గాసిప్స్

బాలీవుడ్ సూపర్‌స్టార్ రణ్వీర్ సింగ్‌కు వాట్సాప్ వాయిస్ నోట్ ద్వారా కోట్ల రూపాయల రాన్సమ్ డిమాండ్ చేస్తూ బెదిరింపులు వచ్చినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. ఇటీవల ‘ధురంధర్’ చిత్రంతో భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్న రణ్వీర్, ఈ బెదిరింపుల విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసం వద్ద భద్రతను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు.
ఇదే సమయంలో దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పుల ఘటన జరగడం నేపథ్యంలో, బాలీవుడ్ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెదిరింపు వాయిస్ నోట్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తు పూర్తయ్యే కొద్దీ మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!