

విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ సంక్రాంతి కానుకగా ఈ నెల 9 న విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడింది. సీబీఎఫ్సీ సూచనల మేరకు మార్పులు చేసినప్పటికీ, బోర్డు సభ్యుల్లో ఒకరి అభ్యంతరాలతో సర్టిఫికేట్ ఇవ్వకుండా నిలిపివేశారు. ఈ విషయం మద్రాసు హైకోర్టుకు చేరగా, ఈ నెల 9 ఉదయం తీర్పు వెల్లడిస్తామని కోర్టు చెప్పడంతో చిత్రబృందం సినిమా విడుదలను పూర్తిగా వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రారంభమైన టికెట్ బుకింగ్స్‌కు రిఫండ్ ప్రక్రియ మొదలైంది.
బుక్‌మైషోలో 4.5 లక్షలకు పైగా టికెట్లు అడ్వాన్స్ బుకింగ్‌లో అమ్ముడవ్వగా, వాటికి పూర్తిగా రిఫండ్ ఇవ్వడం మొదలైందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇది బుక్‌మైషో చరిత్రలోనే అతిపెద్ద రిఫండ్‌గా పేర్కొంటున్నారు. మరోవైపు, థియేటర్లలో నేరుగా టికెట్లు కొనుగోలు చేసిన వారికి అక్కడే డబ్బులు వెనక్కి ఇస్తున్నారు. ఈ ఘటనతో చిత్ర పరిశ్రమ నుంచి విజయ్‌కు మద్దతు పెరుగుతోంది. పెద్ద సినిమాలే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంటే చిన్న సినిమాల పరిస్థితి మరింత ఆందోళనకరమని పలువురు దర్శకులు అభిప్రాయపడుతున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!