

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో “పెద్ది” సినిమాలో నటిస్తున్న ఆయన, ఆ సినిమా తర్వాత వెంటనే దర్శకుడు సుకుమార్‌తో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించనున్నట్లు సమాచారం. “రంగస్థలం” తర్వాత ఈ ఇద్దరి కలయిక మళ్లీ రిపీట్ అవుతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజా సమాచారం ప్రకారం “పెద్ది” విడుదలైన వెంటనే జూన్ నెలలో ఈ కొత్త సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం భారీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. సుకుమార్ తన ప్రత్యేక శైలిలో మరోసారి శక్తివంతమైన కథను సిద్ధం చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!