

తమిళ చిత్రాలతో యువతలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ త్వరలో నేరుగా తెలుగు ప్రేక్షకులను అలరించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న కొత్త చిత్రంలో ఆయన కథానాయకుడిగా నటించనున్నారని సమాచారం. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి చెప్పిన వినూత్న కథ ప్రదీప్‌ను ఆకట్టుకోవడంతో వెంటనే అంగీకారం తెలిపినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆసక్తికర కాంబినేషన్‌పై ఇప్పటికే సినీ అభిమానుల్లో చర్చ మొదలైంది.
తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో ప్రదీప్‌కు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని ద్విభాషా చిత్రంగా రూపొందించే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. దసరా సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రారంభించి, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. అయితే చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!