

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ‘వృషకర్మ’తో పాటు ఓటీటీలో విజయవంతమైన ‘ధూత’ సిరీస్‌కు కొనసాగింపుగా వస్తున్న ‘ధూత 2’లో నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన కెరీర్‌లో ఎదురయ్యే ఒత్తిళ్లు, విజయాలు, అపజయాలపై మాట్లాడారు. కాలంతో పాటు తనలో ఎంతో పరిణతి వచ్చిందని, సినీ పరిశ్రమలో కొత్తగా అడుగుపెట్టేవారు పడే కష్టాలను చూసిన తర్వాత తనకు లభించిన అవకాశాలు, స్థానం మరింత బాధ్యతను కలిగిస్తున్నాయని చెప్పారు. సినిమా విఫలమైనప్పుడు బాధగా అనిపించినా, గెలుపోటములను సమానంగా స్వీకరించడం నేర్చుకున్నానని తెలిపారు. ఒత్తిడిని సానుకూలంగా మార్చుకుని ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.
రాబోయే ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ‘ధూత 2’ కూడా తొలి భాగం తరహాలో హారర్ థ్రిల్లర్‌గానే ఉంటుందని, అయితే ఈసారి కథ జర్నలిజం నేపథ్యానికి బదులుగా వైద్య రంగం చుట్టూ సాగుతుందని నాగచైతన్య వెల్లడించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ షూటింగ్ మరో పది రోజుల్లో పూర్తికానుందని, తన కెరీర్‌లోనే చూడని స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలో ఉంటాయని చెప్పారు. పాన్ ఇండియా సినిమాల విషయంలో మన మూలాలు, సంస్కృతికి సంబంధించిన కథలను నిజాయితీగా చెప్పడం చాలా ముఖ్యమని, స్థానిక కథలను మార్చకుండా సరైన విధంగా ప్రేక్షకులకు చేరవేయడమే అసలైన పాన్ ఇండియా అని నాగచైతన్య అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!