

‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’గా పేరొందిన బెంగళూరులో ట్రాఫిక్ సమస్య మరోసారి చర్చనీయాంశమైంది. నగరానికి చెందిన వ్యాపారవేత్త, అప్లైడ్ ఏఐ స్టూడియో, అప్లైడ్ ఏఐ క్లబ్ కమ్యూనిటీ వ్యవస్థాపకుడు బాలా పన్నీర్ సెల్వం ఉదయం 10.15 గంటలకు ఖాళీగా ఉన్న ఆఫీస్ చిత్రాన్ని లింక్డ్‌ఇన్‌లో షేర్ చేశారు. ట్రాఫిక్ కారణంగా ఉద్యోగులు సమయానికి కార్యాలయాలకు చేరుకోలేకపోతున్నారని తెలిపారు. కేవలం నాలుగు కిలోమీటర్ల ప్రయాణానికే స్కూటర్‌పై 20 నిమిషాలు, కారులో సుమారు 30 నిమిషాలు పడుతోందని, రద్దీ సమయాల్లో మరింత ఆలస్యం అవుతోందని వివరించారు.
ట్రాఫిక్‌లో గంటల తరబడి ప్రయాణించడం ఉద్యోగుల ఉత్పాదకతతో పాటు ఉత్సాహం, వ్యక్తిగత జీవితంపైనా ప్రభావం చూపుతోందని బాలా పేర్కొన్నారు. వైట్‌ఫీల్డ్ నుంచి హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ వరకు సుమారు 17 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి రద్దీ తక్కువగా ఉన్న సమయంలోనూ దాదాపు రెండు గంటలు పడుతోందని తెలిపారు. ట్రాఫిక్ గందరగోళంలోనే మనసంతా చిక్కుకుపోతే మెరుగైన ఆలోచనలు, ఉత్పాదకత ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, ట్రాఫిక్‌తో పాటు గుంతలు, సుదీర్ఘ ప్రయాణ సమయం కూడా ఉద్యోగుల పనితీరుపై ప్రభావం చూపుతున్నాయని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!