

తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు అల్టిమేటం జారీ చేశాయి. టీఈజేఏసీ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణకు ఆమోదం లభించింది. ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ నెల 27న అన్ని జిల్లా కేంద్రాల్లో ఒకరోజు ఉద్యోగుల మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పీఆర్సీ అమలు చేసే వరకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకానున్నారు.
సెప్టెంబర్ 1న రాష్ట్రవ్యాప్తంగా ‘పెన్షన్ విద్రోహ దినం’ పేరుతో నిరసనలు చేపట్టనున్నారు. సెప్టెంబర్ 10న ఉద్యోగులతో కలిసి చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించి మహాధర్నా చేపట్టాలని నిర్ణయించారు. జేఏసీ గతంలో మాదిరిగా కార్యాచరణ ప్రకటించి మధ్యలోనే విరమించుకుంటుందనే అపోహలు ఉన్నాయని టీఈజేఏసీ చైర్మన్ మారం, సెక్రెటరీ జనరల్ ఏలూరి తెలిపారు. ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని, ఉద్యోగుల హక్కుల సాధన కోసం నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!