
జనరల్

నటి శ్రీదేవి కుటుంబానికి మద్రాసు హైకోర్టులో భారీ ఊరట లభించింది. చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్లో ఉన్న సుమారు 4.7 ఎకరాల భూమిపై బోనీ కపూర్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ల హక్కులను ప్రశ్నిస్తూ కొందరు వ్యక్తులు దాఖలు చేసిన దావాను హైకోర్టు కొట్టివేసింది. 1988లో శ్రీదేవి చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ఈ భూమిపై నకిలీ వారసత్వ సర్టిఫికెట్లతో కొందరు హక్కులు కోరినట్లు కోర్టులో వెల్లడైంది.
ఈ కేసును విచారించిన జస్టిస్ టి.వి. తమిళ్ సెల్వి ధర్మాసనం, ఈ దావాను ప్రయోజనం లేని అక్రమ ప్రయత్నంగా పేర్కొంటూ తిరస్కరించింది. గతంలో చెంగల్పట్టు కోర్టులో దాఖలైన టైటిల్ కేసును కూడా హైకోర్టు కొట్టివేసింది. దీంతో శ్రీదేవి కుటుంబానికి ఈ కేసులో పెద్ద ఉపశమనం లభించినట్టైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!