

భర్త మహాశయులకు విజ్ఞప్తితో ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు అద్భుతమైన వినోదాన్ని అందించేందుకు మాస్ మహారాజా రవితేజ సిద్ధమయ్యారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై భారీ బజ్‌ను సృష్టించగా, ఈ చిత్రం జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రెస్ మీట్లో దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ, ఈ సినిమా పూర్తిగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరిస్తుందని తెలిపారు. రవితేజ గారిని దృష్టిలో పెట్టుకొని మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కథ రాసినట్లు చెప్పారు. రవితేజ మార్క్ ఫన్ మిస్ కాకుండా, క్యారెక్టర్‌ను ఫాలో అవుతూ సినిమాను ట్రీట్ చేసినట్లు వెల్లడించారు. రవితేజ ఈ చిత్రంలో చాలా ఫ్రెష్‌గా, కొత్తగా కనిపిస్తారని, సంక్రాంతి పండగ వాతావరణంలో సినిమా ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ, ఈ సినిమాను ప్రత్యేకంగా సంక్రాంతి ఎంటర్టైనర్గా రూపొందించినట్లు తెలిపారు. హీరోయిన్ డింపుల్ హయతి తన పాత్ర బాలామణి కొత్తగా ఉండబోతుందని, భోగి రోజున విడుదలవుతున్న ఈ సినిమా తనకు ఎంతో స్పెషల్ అని చెప్పారు. ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ, సినిమా టైటిల్ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుందని, మోడ్రన్ రిలేషన్‌షిప్‌ను హ్యూమరస్‌గా, సెన్సిబుల్‌గా చూపించామని తెలిపారు. రవితేజతో పని చేయడం చాలా ఆనందంగా ఉందని, ఈ సినిమా ప్రేక్షకులకు నిజమైన సంక్రాంతి పండగ అనుభూతిని ఇస్తుందని ఆమె అన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!