

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 111వ చిత్రం ముంబయి నేపథ్యంలో సాగనున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ వారం నుంచే ముంబయిలో సుదీర్ఘ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుండగా, ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్ ఘట్టాలను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
వీరసింహారెడ్డి విజయానంతరం బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఇద్దరి శైలికి తగ్గట్టుగా మాస్ కమర్షియల్ అంశాలు, యాక్షన్, ఎమోషన్‌ల మేళవింపుతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!