

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్మూజ్ జలసంధిపై కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌కు చెందిన నౌకలు, వాటి వినియోగదారులపై దిగ్బంధనాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించిన ఆయన, మిగతా దేశాలకు హార్మూజ్ జలసంధి ద్వారా స్వేచ్ఛగా రాకపోకలు కొనసాగుతాయని తెలిపారు. అయితే ఈ ప్రాంతంలో భద్రత కల్పించే ఖర్చుల కోసం హార్మూజ్ గుండా వెళ్లే వాణిజ్య సరుకులపై 20 శాతం రుసుము అమెరికాకు చెల్లించాలని ప్రతిపాదించారు. ఈ ప్రకటనను ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు.
ఈ ప్రకటన అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గాల్లో హార్మూజ్ జలసంధి ఒకటి కావడంతో, ఈ నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరా, చమురు ధరలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే అంతర్జాతీయ సముద్ర చట్టాల పరంగా ఈ ప్రతిపాదనపై వివిధ దేశాలు ఎలా స్పందిస్తాయన్న అంశంపై ఆసక్తి నెలకొంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!