

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన 'లెనిన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి అఖిల్ కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా క్లైమాక్స్‌కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తుండగా, ప్రస్తుతం ప్రీ క్లైమాక్స్‌లోని ఓ కీలక సన్నివేశంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. 1999లో నందమూరి బాలకృష్ణ నటించిన 'కృష్ణబాబు' సినిమాలోని ఓ ఐకానిక్ సీన్‌తో ఈ సన్నివేశానికి పోలికలు ఉన్నాయని కొందరు నెటిజన్లు వీడియోలతో సహా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోలికల ప్రకారం, రెండు చిత్రాల్లోనూ విలన్ కుట్ర కారణంగా హీరో తనకు తెలియకుండానే విషాదకర పరిస్థితిని ఎదుర్కొనేలా కథ నడుస్తుంది. దీంతో కొందరు దీన్ని 'స్ట్రైట్ కాపీ'గా విమర్శిస్తుండగా, మరికొందరు మాత్రం దర్శకుడు పాత క్లాసిక్ ఎమోషన్‌ను నేటి ప్రేక్షకులకు తగ్గట్టు కొత్తగా ఆవిష్కరించాడని అభిప్రాయపడుతున్నారు. ఈ చర్చలపై 'లెనిన్' చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!