
జనరల్

బిహార్‌లో ఆశ్చర్యానికి గురిచేసే ఘటన వెలుగులోకి వచ్చింది. 82 ఏళ్ల వృద్ధుడు తనకు వచ్చిన రూ.400 పింఛన్ తీసుకున్న తర్వాత బ్యాంకు ఖాతా బ్యాలెన్స్‌ను పరిశీలించగా, అందులో రూ.759 కోట్లకు పైగా ఉన్నట్లు కనిపించింది. దీంతో ఒక్కసారిగా వృద్ధుడు, కుటుంబ సభ్యులు, బ్యాంకు సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆయన దివ్యాంగ కుమారుడి ఖాతాలో కూడా దాదాపు అదే మొత్తం కనిపించింది. దీంతో తండ్రీకొడుకుల ఇద్దరి ఖాతాల్లో కలిపి రూ.1,500 కోట్లకు పైగా బ్యాలెన్స్ నమోదైనట్లు వెల్లడైంది. ఈ ఘటనపై బ్యాంకు అధికారులు, పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. ప్రాథమికంగా ఇది సాంకేతిక లేదా సాఫ్ట్వేర్ లోపం కారణంగా జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!