

ఎస్సెల్ గ్రూప్, జీ గ్రూప్ చైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర తండ్రి శ్రీ నంద్ కిశోర్ గోయెంకా 96 ఏళ్ల వయసులో కన్నుమూశారు. సుదీర్ఘ జీవితంలో కుటుంబానికి విలువలు, మార్గదర్శకత్వం అందించిన ఆయన మరణం పట్ల దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, వివిధ పార్టీల అధ్యక్షులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. డాక్టర్ సుభాష్ చంద్రతో పాటు గోయెంకా కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు.
చిన్న వ్యాపారంతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన నంద్ కిశోర్ గోయెంకా క్రమంగా వ్యాపార రంగంలో విశిష్ట స్థానం సంపాదించారు. ఆయన చూపిన విలువలు, క్రమశిక్షణ, ముందుచూపు గోయెంకా కుటుంబ విజయానికి బలమైన పునాది అయ్యాయి. అదే స్ఫూర్తితో డాక్టర్ సుభాష్ చంద్ర మీడియా రంగంలో అడుగుపెట్టి జీ గ్రూప్‌ను దేశంలోని ప్రముఖ మీడియా సంస్థగా తీర్చిదిద్దారు. దశాబ్దాలుగా వేలాది మందికి ఉపాధి కల్పించిన ఈ కుటుంబ సేవలను పలువురు కొనియాడుతూ నంద్ కిశోర్ గోయెంకాకు ఘన నివాళులు అర్పించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!