15, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘విశ్వనాథ్ & సన్స్’కు ప్రేక్షకులే నిజమైన హీరోలు - త్రివిక్రమ్

Writer: Pooja 10:26 PM, 15 ఆగస్టు, 2026
‘విశ్వనాథ్ & సన్స్’కు ప్రేక్షకులే నిజమైన హీరోలు - త్రివిక్రమ్

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘విశ్వనాథ్ & సన్స్’కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కుటుంబ కథా చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటించగా, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఆగస్టు 14న విడుదలైన ఈ చిత్రం మంచి ఆదరణతో వసూళ్ల పరంగా దూసుకెళ్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌లో సక్సెస్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్:

ఈ సినిమా తనకు ఎంతో దగ్గరైందని, కుటుంబ కథను ఎంచుకుని విజయవంతం చేసిన చిత్రబృందాన్ని అభినందించారు. సూర్య నటనను ప్రశంసిస్తూ, ఆయనతో త్వరలో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సూర్య, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్, మమితా బైజు ఈ చిత్రానికి నాలుగు ప్రధాన స్తంభాలుగా నిలిచారని అన్నారు. వెంకీ అట్లూరి రచన, దర్శకత్వాన్ని మెచ్చుకున్న త్రివిక్రమ్. ఈ సినిమాకు నిజమైన హీరోలు ప్రేక్షకులేనని పేర్కొంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

సూర్య:

సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు మాటల్లో కృతజ్ఞతలు చెప్పలేనని అన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కార్యక్రమానికి రావడం సినిమాను మరింత ప్రత్యేకంగా మార్చిందని తెలిపారు. వివిధ ప్రాంతాలు, భాషలకు చెందిన కళాకారులంతా కలిసి మంచి సినిమా చేశామని, కుటుంబ కథా చిత్రాలకు ప్రేక్షకులు మళ్లీ ఆదరణ చూపిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. కొన్ని సినిమాలను కేవలం వసూళ్లతో కొలవలేమని, ప్రేక్షకులు పొందిన అనుభూతిలోనే అసలు విజయం ఉంటుందని చెప్పారు.

వెంకీ అట్లూరి:

ఫ్యామిలీ సినిమాల ట్రెండ్ అంతగా లేని సమయంలో ఈ కథను రూపొందించామని తెలిపారు. త్రివిక్రమ్, నిర్మాత వంశీ తదితరులు ఇచ్చిన ప్రోత్సాహం తనకు ఎంతో బలాన్నిచ్చిందన్నారు. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు వసూళ్లు రెట్టింపు కావడం తన కెరీర్‌లో తొలిసారి చూస్తున్నానని చెప్పారు. సినిమా విజయానికి, ముఖ్యంగా వసూళ్లకు సూర్యే ప్రధాన కారణమని పేర్కొంటూ చిత్రబృందానికి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

రవీనా టాండన్:

‘విశ్వనాథ్ & సన్స్’ విజయంతో ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. వెంకీ అట్లూరి ఎంతో వినయంగా, ప్రేమగా పనిచేస్తూ నటీనటుల నుంచి మంచి నటన రాబట్టారని ప్రశంసించారు. సూర్యతో కలిసి పనిచేయడం, రాధిక శరత్‌కుమార్‌తో నటించడం తనకు ప్రత్యేక అనుభూతినిచ్చిందని తెలిపారు. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అల్లు అర్జున్‌ ట్వీట్‌పై ట్రోల్స్‌

అల్లు అర్జున్‌ ట్వీట్‌పై ట్రోల్స్‌

సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’

సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’

మతపరమైన హేట్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా

మతపరమైన హేట్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా

‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఇట్లు అర్జున’ సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్

‘ఇట్లు అర్జున’ సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్

సునీత వ్యాఖ్యలపై గోవిందా ఫైర్

సునీత వ్యాఖ్యలపై గోవిందా ఫైర్

ట్యాగ్లు
విశ్వనాథ్ అండ్ సన్స్సూర్యత్రివిక్రమ్ శ్రీనివాస్వెంకీ అట్లూరిటాలీవుడ్సినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
షోపియాన్‌లో ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణం
జనరల్

షోపియాన్‌లో ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణం

నల్సార్ విద్యార్థులకు బీసీఐ చైర్మన్ క్షమాపణ
జనరల్

నల్సార్ విద్యార్థులకు బీసీఐ చైర్మన్ క్షమాపణ

అల్లు అర్జున్‌ ట్వీట్‌పై ట్రోల్స్‌
సినిమాలు

అల్లు అర్జున్‌ ట్వీట్‌పై ట్రోల్స్‌

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై కేఏ పాల్‌ అభ్యంతరం
జనరల్

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై కేఏ పాల్‌ అభ్యంతరం

అరవింద్‌ వ్యాఖ్యలపై ఎంపీ అనిల్‌ యాదవ్‌ ఫైర్‌
రాజకీయాలు

అరవింద్‌ వ్యాఖ్యలపై ఎంపీ అనిల్‌ యాదవ్‌ ఫైర్‌

మహిళల ఆత్మవిశ్వాసం పెంచిన ‘స్త్రీ శక్తి’
జనరల్

మహిళల ఆత్మవిశ్వాసం పెంచిన ‘స్త్రీ శక్తి’

సూపర్‌స్టార్ సినిమాలో శ్రీలీల?
గాసిప్స్

సూపర్‌స్టార్ సినిమాలో శ్రీలీల?

సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’
సినిమాలు

సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’

మతపరమైన హేట్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా
సినిమాలు

మతపరమైన హేట్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా

‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఇట్లు అర్జున’ సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్
సినిమాలు

‘ఇట్లు అర్జున’ సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్

‘విశ్వనాథ్ & సన్స్’కు ప్రేక్షకులే నిజమైన హీరోలు - త్రివిక్రమ్
సినిమాలు

‘విశ్వనాథ్ & సన్స్’కు ప్రేక్షకులే నిజమైన హీరోలు - త్రివిక్రమ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!