

దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ’ భారతీయ సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్తుందని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అన్నారు. హాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్‌తో కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న రెహమాన్, ఇది తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా అభివర్ణించారు. ముఖ్యంగా సినిమాలో ఉపయోగిస్తున్న అత్యాధునిక సాంకేతికత, అద్భుతమైన 3డీ విజువల్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయని తెలిపారు.
హన్స్ జిమ్మర్‌తో కలిసి పనిచేయడం గర్వకారణమని పేర్కొన్న రెహమాన్, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప అవకాశంగా దీనిని భావిస్తున్నట్లు చెప్పారు. హన్స్ జిమ్మర్ కారణంగా విదేశీ ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రంపై ఆసక్తి పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్న ఈ రెండు భాగాల చిత్రాన్ని ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సుమారు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మొదటి భాగం దీపావళి కానుకగా విడుదల కానుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!