

వరుస ఘన విజయాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పొలిశెట్టి, తన తదుపరి చిత్రం ‘అనగనగా ఒక రాజు’తో 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా, నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించారు. చిత్ర ప్రచారంలో భాగంగా మంగళవారం హైదరాబాద్ రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో ‘రాజు గారి పెళ్లి రిసెప్షన్’ పేరుతో వినూత్నంగా ఈవెంట్ నిర్వహించారు.
ఈ వేడుకలో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి వధూవరుల్లా వేదికపై కనిపించి పాటలకు నృత్యం చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా మాట్లాడిన నవీన్ పొలిశెట్టి, తన ప్రమాదం తర్వాత అభిమానుల ప్రేమతోనే త్వరగా కోలుకున్నానని, ఈ సినిమా సంపూర్ణ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలుస్తుందని అన్నారు. మీనాక్షి చౌదరి కూడా ఈ చిత్రంపై పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తూ, ఇది తన మూడో సంక్రాంతి విడుదల కావడం ఆనందంగా ఉందన్నారు. ‘అనగనగా ఒక రాజు’ చిత్రం జనవరి 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!