

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన రాబోయే చిత్రం ఏఏ23 కోసం భావోద్వేగ నిర్ణయం తీసుకున్నారు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తనకు అత్యంత సన్నిహితులైన నలుగురు స్నేహితులు బన్నీ వాస్, సందీప్ రామినేని, నటరాజ్, స్వాతిలను ఈ చిత్రానికి కో-ప్రొడ్యూసర్లుగా తీసుకొచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి వీరు నిర్మాణ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ నిర్ణయం అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది.
దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో అల్లు అర్జున్ చేస్తున్న తొలి చిత్రం ఏఏ23 కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కథ, అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన వివరాలను చిత్రబృందం గోప్యంగా ఉంచినప్పటికీ, షూటింగ్‌కు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. మరోవైపు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న రాకా చిత్రంలోనూ అల్లు అర్జున్ నటించనుండటంతో ఆయన కెరీర్‌లో ఇది అత్యంత కీలక దశగా మారింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!