
జనరల్

టాటా గ్రూప్ నిర్వహణలో ఉన్న ఎయిరిండియా కొత్త సీఈఓ, ఎండీగా టెవోల్డె జెబ్రెమరియంను నియమించారు. టాటా గ్రూప్ మాతృసంస్థ టాటా సన్స్ ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ మాజీ చీఫ్‌గా పనిచేసిన టెవోల్డె, ఆ సంస్థను విస్తరించడంలో, లాభాల బాట పట్టించడంలో కీలక పాత్ర పోషించారు.
టెవోల్డె నాయకత్వంలో ఎయిరిండియా మరింత అభివృద్ధి సాధిస్తుందని టాటా గ్రూప్ ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ఆయన బాధ్యతలు స్వీకరించే తేదీని ఎయిరిండియా ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుత సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ ఈ ఏడాది ఏప్రిల్‌లో రాజీనామా ప్రకటించడంతో ఆయన స్థానంలో టెవోల్డెను నియమించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!