

ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,980 పెరిగి రూ.1,49,730కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,650 పెరిగి రూ.1,37,250గా నమోదైంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,990 పెరిగి రూ.1,12,300కు చేరింది.
ఉదయం 10 గంటల నాటికి హైదరాబాద్‌తో పాటు వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, కడప వంటి నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,730గా ఉంది. 22 క్యారెట్ల బంగారం రూ.1,37,250, 18 క్యారెట్ల బంగారం రూ.1,12,300గా నమోదైంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలు పెరిగాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,50,000గా ఉండగా, ఢిల్లీలో రూ.1,49,860, ముంబై, కోల్‌కతా, బెంగళూరులో రూ.1,49,730గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు దేశీయ డిమాండ్ కారణంగా బంగారం ధరలు మరింత బలపడినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
గమనిక: బంగారు ధరలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి, ఆభరణాలు కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మరోసారి సరిచూసుకోవడం మంచిది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!