

యువ దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కిస్తున్న ఆకాశంలో ఒక తార సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో పాటు ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నేడు ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర బృందాన్ని అభినందించిన ఆయన, సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన తండ్రి అల్లు అరవింద్ సాధారణంగా సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడరని, అయితే ఆకాశంలో ఒక తార చిత్ర రషెస్ చూసిన తర్వాత మాత్రం సినిమాపై ఎంతో నమ్మకంగా కనిపించారని, దాని గురించి ఆసక్తిగా మాట్లాడారని అల్లు అర్జున్ తెలిపారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచాయి.
ఈ వేడుకలో మరో ప్రత్యేక ఆకర్షణగా అల్లు అర్జున్ చిత్ర బృందం మొత్తంతో కలిసి దిగిన సెల్ఫీ నిలిచింది. ఈ ఫొటోలో దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, స్వాసిక, రుహానీ శర్మ, దర్శకుడు పవన్ సాధినేని, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్‌లతో పాటు అల్లు అర్జున్ కనిపించారు. ఈ సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆకాశంలో ఒక తార సినిమా 2026 నవంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది. లైట్‌బాక్స్ మీడియా సంస్థకు చెందిన సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మించగా, అల్లు అరవింద్‌కు చెందిన గీతా




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!