

అల్లరి నరేష్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘12A రైల్వే కాలనీ’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాని కసరగడ్డ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కమాక్షీ భాస్కర్ల హీరోయిన్గా కనిపిస్తున్నారు. విడుదలకు ముందు జరిగిన ప్రమోషన్స్‌లో భాగంగా, నరేష్ మీమర్స్‌తో మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన తన కెరీర్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘సుడిగాడు’ చిత్ర సీక్వెల్ గురించి మాట్లాడారు. ‘సుడిగాడు 2’ ప్రస్తుతం రైటింగ్ స్టేజ్‌లో ఉందని, తొలి భాగంలో 100 సినిమాలను ప్యారడీ చేసినట్లు, ఈసారి ఆ సంఖ్య మరింత డబుల్ కానుందని తెలిపారు. పాన్-ఇండియా సినిమాలపై స్పూఫ్స్ ఉండబోతున్నట్లు నరేష్ పేర్కొన్నారు.
సీక్వెల్లో ‘యానిమల్’, ‘పుష్ప 2’ వంటి పాన్-ఇండియా చిత్రాలపై కూడా స్పూఫ్స్ జోడించే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. స్క్రిప్ట్ ఇంకా డెవలప్ అవుతుండడంతో కొంత సమయం పడుతుందని, ‘సుడిగాడు 2’ షూటింగ్ 2027లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని నరేష్ వెల్లడించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!