
.avif&w=3840&q=75)
ఇంకొద్ది గంటల్లో The Raja Saab ప్రీమియర్ షోలు ప్రారంభం కానుండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ జారీ చేయడంతో టికెట్ అమ్మకాలు వేగంగా మొదలయ్యాయి. ఫ్లాట్గా రూ.1000 ధరతో టికెట్లు విక్రయిస్తుండగా, కొన్ని సెంటర్లలో థియేటర్ కెపాసిటీని బట్టి రూ.800, రూ.600 ధరలు కూడా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతి ప్రకారం రేపటి నుంచి పది రోజుల పాటు ఈ పెంపు ధరలు అమల్లో ఉంటాయి.
దీంతో పండుగ ముగిసే వరకు ‘రాజా సాబ్’ను రెగ్యులర్ రేట్లలో చూడడం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. గతంలో పుష్ప 2 కు కూడా ఇదే విధానాన్ని అనుసరించారు. మరోవైపు, టికెట్ ధరల అంశంపై న్యాయస్థానాల్లో వాదనలు కొనసాగుతుండగా, తెలంగాణలో మాత్రం జీఓ ఆలస్యం కావడంతో బుకింగ్స్ ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రీమియర్ షోలకు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వగా, తెలంగాణ నిర్ణయంపై అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!