

మరో మూడు రోజుల్లో రాజా సాబ్ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అభిమానులు, ట్రేడ్ వర్గాల్లో ఉత్కంఠ గరిష్ఠ స్థాయికి చేరింది. జనవరి 8 అర్ధరాత్రి జరిగే ప్రీమియర్ షోలపై అనుమతులు వస్తాయా లేదా అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ముఖ్యంగా తెలంగాణలో చివరి నిమిషంలో అనుమతులు రావడంపై అనిశ్చితి ఉండటంతో అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో ప్రీమియర్ షోల కోసం ప్రత్యేక టికెట్ ధరలు అనుమతించాలని సినిమాటోగ్రఫీ మంత్రికి లేఖ వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. మల్టీప్లెక్సుల్లో రూ.1000, సింగిల్ స్క్రీన్లలో రూ.800 టికెట్ ధరలు ప్రతిపాదించడంతో ఇండస్ట్రీలో చర్చ మొదలైంది.
ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పెద్దగా అడ్డంకులు కనిపించడం లేదు. ఇటీవల పెద్ద సినిమాలకు అనుమతులు రావడంతో అక్కడ రాజా సాబ్‌కు సమస్య ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ నిజాం ఏరియాలో బెనిఫిట్ షోలు, ధరల పెంపుపై కోర్టు వ్యవహారాలు అడ్డంకిగా మారే అవకాశముందని సమాచారం. చివరి నిమిషంలో ఇబ్బందులు రాకుండా అధికారులు మార్గాలు అన్వేషిస్తున్నా, ఎంతవరకు అనుమతులు వస్తాయన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.
ఇక ప్రమోషన్ల విషయానికి వస్తే, సినిమా టీమ్ ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను పూర్తిచేసింది. ప్రభాస్ తో పాటు ముగ్గురు హీరోయిన్లు కనిపించే హై ఎనర్జీ పాటకు మంచి స్పందన వచ్చింది. సంక్రాంతి రేసులో ముందుగా థియేటర్లకు వస్తున్న రాజా సాబ్‌కు ఓపెనింగ్స్ భారీగా ఉంటాయని అంచనా. అయితే సినిమా లాంగ్ రన్ పూర్తిగా ప్రేక్షకుల టాక్‌పై ఆధారపడి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
.png&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!