

ప్రయోగాత్మక కథలతో పాటు అద్భుతమైన యాక్షన్ స్టంట్స్, వినోదభరిత పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ ఇప్పుడు పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంతో రానున్నారు. ‘ది కేరళ స్టోరీ’ నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షాతో కలిసి ఆయన ‘సముక్’ అనే భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు కనిష్క్ వర్మ తెరకెక్కించనున్నారు. ఏలియన్ సర్వైవల్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమా ప్రస్తుతం పూర్వ నిర్మాణ దశలో ఉండగా, త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుందని సమాచారం.
ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించేందుకు హాలీవుడ్ అనుభవం ఉన్న సాంకేతిక నిపుణులను కూడా తీసుకురానున్నారు. అక్షయ్ కుమార్ మాట్లాడుతూ ‘సముక్’ కథ తనను ఎంతో ఆకట్టుకుందని, ఏలియన్ థ్రిల్లర్ జానర్ తనకు పూర్తిగా కొత్త అనుభవమని తెలిపారు. ఈ సినిమా ద్వారా కొత్త తరహా కథను ప్రేక్షకులకు అందించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!