
సినిమాలు

నందమూరి బాలకృష్ణ అభిమానులకు ‘అఖండ 2’ నిర్మాతలు నూతన సంవత్సర శుభవార్త చెప్పారు. న్యూ ఇయర్ కానుకగా తెలంగాణలో ఈ సినిమాను తక్కువ టికెట్ ధరలకే ప్రేక్షకులకు అందించబోతున్నారు. అయితే ఈ ఆఫర్ పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కావడం విశేషం.
తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ‘అఖండ 2’ సినిమాను రూ. 50, రూ. 80, రూ. 105 ధరలకు ప్రదర్శించనున్నారు. మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ ధరను రూ. 150 గా నిర్ణయించారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు.
సంక్రాంతి సీజన్లో విడుదలవుతున్న మొదటి సినిమా ‘ది రాజా సాబ్’ జనవరి 9 వ తేదీన థియేటర్లలోకి రానుంది. అందువల్ల జనవరి 8 వ తేదీ వరకు ‘అఖండ 2’ సినిమాను తక్కువ ధరలకే వీక్షించే అవకాశాన్ని దిల్ రాజు ప్రేక్షకులకు కల్పించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!