

అసాధ్యాలను కూడా సాధ్యం చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఏది నిజం, ఏది అబద్ధం అన్న గీతను చెరిపేస్తూ ఏఐ సృష్టించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పంచుకున్న ఒక ఏఐ వీడియో ఇదే అంశాన్ని మళ్లీ చర్చలోకి తీసుకొచ్చింది.
ఆ వీడియోలో స్టార్ హీరో మహేశ్‌బాబు మరియు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మధ్య గొడవ జరుగుతున్నట్లు చూపించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘సినిమా ఈజ్ డెడ్’ అంటూ వర్మ షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు క్రియేటివిటీని మెచ్చుకోగా, మరికొందరు ఏఐ దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మహేశ్‌బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం వారణాసిపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం వేగంగా చిత్రీకరణ జరుపుకుంటూ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!