

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా విడుదలకు సిద్ధమైంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయవాడలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన రామ్ చరణ్, ఈ సినిమా తన కెరీర్లో ప్రత్యేక స్థానం సంపాదిస్తుందని అన్నారు. ‘మగధీర’, ‘రంగస్థలం’, ‘RRR’ వంటి చిత్రాల సరసన ‘పెద్ది’ కూడా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన అనుభవాలను పంచుకున్న చరణ్, ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయని తెలిపారు. ‘పెద్ది’ కథను తన వద్దకు తీసుకువచ్చినందుకు దర్శకుడు సుకుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను ఒక అద్భుతమైన ప్రయాణంలా తీర్చిదిద్దారని ప్రశంసించారు. అభిమానులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని, తన సినీ ప్రయాణంలో ‘పెద్ది’ ఒక ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!