

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 50 ఏళ్లలో ఇంతగా చర్చకు వచ్చిన సినిమా మరొకటి లేదంటూ ఈ మూవీని ఆర్జీవీ ఆకాశానికెత్తేశాడు. సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వర్మ, ఈసారి తన ట్వీట్‌తో సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాడు.
సినిమాలు తీయడం తగ్గించినా, ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై తనదైన శైలిలో స్పందించే ఆర్జీవీ, కొత్తగా విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లపై తన అభిప్రాయాలను నిర్భయంగా చెబుతుంటాడు. తాజాగా ‘ధురంధర్’ సినిమా గురించి స్పందించిన ఆయన, ఈ మూవీని చూసిన తర్వాత ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న పాన్ ఇండియా సినిమాల పరిస్థితి ఏంటో తలచుకుంటేనే భయమేస్తోందని వ్యాఖ్యానించాడు.
ఈ సందర్భంగా వర్మ ఒక ఆసక్తికర ఉపమానం కూడా ఉపయోగించాడు. “మనం ఎవరి ఇంటికైనా వెళ్లినప్పుడు అక్కడ ఒక కుక్క మనల్ని చూస్తూ ఉంటే, ఇంటి యజమాని అది ఏమీ చేయదులే అన్నా మనలో భయం అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాంటిదే. ప్రతి ప్రొడక్షన్ ఆఫీసులోనూ ఈ సినిమా అనే కుక్క అదృశ్యంగా తిరుగుతూ అందరినీ భయపెడుతోంది. దాని పేరు ఎత్తడానికి కూడా వాళ్లు ఇష్టపడటం లేదు” అంటూ వ్యాఖ్యానించాడు.
ఇప్పటివరకు గ్రాఫిక్స్, భారీ సెట్లు, ఐటమ్ సాంగ్స్, స్టార్ హీరోల భజన అనే ఒకే టెంప్లేట్‌తో సినిమాలు తీస్తున్నవారికి ‘ధురంధర్’ ఒక హారర్ సినిమాలా మారిందని వర్మ అభిప్రాయపడ్డాడు. ఈ సినిమా పెట్టిన స్టాండర్డ్స్‌ను అందుకోలేక మిగతా వాళ్లు భయం, అసూయతో సైలెంట్‌గా ఉన్నారని పేర్కొన్నాడు. “గత 50 ఏళ్లలో ఇంతగా చర్చించుకున్న సినిమా మరొకటి లేదు” అని స్పష్టం చేశాడు.
ఇప్పటికే వెయ్యి కోట్లకు చేరువైన కలెక్షన్లతో ‘ధురంధర్’ బాలీవుడ్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాపై ఆర్జీవీ నుంచి వచ్చిన ప్రశంసలు ఇప్పుడు మరింత చర్చకు దారి తీశాయి. ఆర్జీవీ స్టైల్లో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!